ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని అడ్డుకునేదెవరో తెలుసు: వ‌ర్మ‌

Wed,May 1, 2019 01:02 PM
varma sensational comments goes viral

రామ్ గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త‌ప్ప మిగ‌తా అంత‌టా విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో సెన్సార్ బోర్డు చిత్ర విడుదలను నిలిపేసిన విషయం తెలిసిందే. అన్ని చిక్కులను దాటి ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ లో మే 1న లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలవుతుందని వ‌ర్మ త‌న ట్విట్ట‌ర్ లో పేర్కొన్నాడు. కాని ఇప్పుడు కూడా సినిమా విడుద‌ల‌ని అడ్డుకోవ‌డంపై వ‌ర్మ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గ‌తంలో ఏపీ హైకోర్టు తీర్పుతో పాటు ఈసీ ఇచ్చిన లేఖ‌ని జ‌త చేసిన వ‌ర్మ న్యాయ ప‌రంగా ఈ విష‌యంపై పోరాడ‌తాన‌ని త‌న ట్వీట్‌లో తెలిపాడు. పోలింగ్ పూర్తైన త‌ర్వాత సినిమాని విడుద‌ల చేసుకోవ‌చ్చనే ఉత్త‌ర్వులు రావ‌డంతో త‌మ సినిమా రిలీజ్‌కి ఏర్పాట్లు చేసుకున్నాడు వ‌ర్మ‌. కాని మ‌ళ్ళీ ఈ చిత్ర విడుద‌ల‌కి అడ్డుప‌డ‌డంతో ఇలా ఎవ‌రు చేస్తున్నారో, అంద‌రికి తెలుసంటూ వ‌ర్మ త‌న ట్వీట్‌లో ఆవేద‌న వెళ్ళ‌బుచ్చాడు. ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి ప్రవేశించిన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కించాడు వర్మ.2520
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles