చంద్ర‌బాబు అడ్రెస్ చెప్పినందుకు ల‌క్ష బ‌హుమానం

Sun,October 14, 2018 07:11 AM
varma sends one lakh to rohith

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తాను ఎన్టీఆర్ బ‌యోపిక్‌ని ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ పేరుతో తెర‌కెక్కించనున్న‌ట్టు ప్ర‌క‌ట‌న చేస్తూ అప్ప‌ట్లో ఓ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. కాని కొన్నాళ్లుగా ఆ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి స‌మాచారం లేదు. తాజాగా ఆ ప్రాజెక్ట్ ని మ‌రో సారి తెరపైకి తెచ్చిన వ‌ర్మ ఈ మూవీ లాంచింగ్ దసరా (విజయదశమి) రోజు నిర్వహించనున్నట్లు తెలిపారు వర్మ. ఎన్టీఆర్ గారి మీద గౌరవంతో తిరుమల శ్రీవారి పాదాల చెంత అక్టోబర్ 19న సినిమా లాంచింగ్ నిర్వహిస్తామన్నారు. జ‌న‌వ‌రి నెలాఖ‌రుకి సినిమా విడుద‌ల చేస్తాన‌ని చెప్పుకొచ్చారు. అయితే త‌న సినిమాలోని పాత్ర‌ల‌కి ప‌ర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యే వాళ్ళ‌ని ఎంపిక చేసుకునే వ‌ర్మ .. చంద్ర‌బాబుగా హోట‌ల్‌లో వ‌డ్డించే వ్య‌క్తిని ఎంపిక చేసుకున్నాడు.

మ‌నిషిని పోలిన మ‌నుషులు ఏడుగురు ఉంటార‌ని మ‌నం వింటూనే ఉన్నాం. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబులా ఉన్న వ్య‌క్తికి సంబంధించిన వీడియో కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఆ వీడియో వ‌ర్మ చెంత‌కి చేర‌డంతో వెంట‌నే త‌న ట్విట్ట‌ర్ ద్వారా ఆ వ్యక్తిని నాకు ప‌రిచయం చేసిన వారికి ల‌క్ష బ‌హుమ‌తిగా ఇస్తాన‌ని ట్వీట్‌లో తెలిపాడు. దీంతో అంద‌రు ఆ వ్య‌క్తి గురించి ఆరాలు తీయ‌డం మొద‌లు పెట్టారు. చివ‌రికి ఓ ప్ర‌ముఖ ఛానెల్‌కి సంబంధించిన ముత్యాల రోహిత్ అనే యువకుడు చంద్ర‌బాబులా ఉన్న వ్య‌క్తి స‌మాచారం వ‌ర్మ‌కి అందించాడు. ఈ విష‌యాన్ని వ‌ర్మ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేస్తూ .. సినిమా ప్రారంభంలో అతని పేరును తెరపై వేస్తామని, బ్యాంకు ఖాతా వివరాల తెలియజేయాలని, ఆ వెంటనే తాను ప్రకటించిన లక్ష రూపాయలను పంపుతానని చెప్పాడు. ప్రముఖ కథానాయకుడు ఎన్టీఆర్‌, ఆయన సతీమణి లక్ష్మీ పార్వతి జీవితం ఆధారంగా వర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాను తీయ‌నున్న సంగ‌తి తెలిసిందే. చిత్రాన్ని లక్ష్మీ పార్వతి దృష్టికోణం నుంచి ఎన్టీఆర్‌ను చూపించబోతున్నట్లు తెలిపారు. రాకేష్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాను జీవీ ఫిల్మ్స్‌ పతాకంపై బాల గిరి సమర్పిస్తున్నట్లు తెలిపారు.


6247
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles