కేఏ పాల్ చేతుల మీదుగా సెన్సార్ స‌ర్టిఫికెట్ అందుకున్న వ‌ర్మ‌

Sun,December 8, 2019 10:29 AM

రామ్ గోపాల్ వర్మ‌, సిద్ధార్ధ తాతోలు క‌లిసి తెర‌కెక్కించిన చిత్రం అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు. ముందు క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు అనే టైటిల్‌ని ఈ చిత్రానికి ఫిక్స్ చేయ‌గా, ప‌లు కార‌ణాల వ‌ల‌న టైటిల్ చేంజ్ చేశారు. నవంబ‌ర్ 29న చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందం భావించ‌గా, సెన్సార్ స‌మ‌స్య‌ల వ‌ల‌న చిత్రం రిలీజ్‌కి నోచుకోలేక‌పోయింది. ఎట్ట‌కేల‌కి డిసెంబ‌ర్ 12న చిత్రం విడుద‌ల‌కి సిద్ధంగా ఉంది.


ఆంధ్రప్ర‌దేశ్‌కి చెందిన కొంద‌రు రాజ‌కీయ నాయ‌కుల నేప‌థ్యంలో అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు పేరుతో సినిమా చేస్తున్నారు వ‌ర్మ‌. ఈ సినిమాపై కేఏ పాల్ మండిప‌డ్డారు. సినిమాని రిలీజ్ చేయోద్ద‌ని కోర్టులో పిటీష‌న్ కూడా వేశారు. అయితే తాజాగా వ‌ర్మ కేఏ పాల్ నుండి సెన్సార్ స‌ర్టిఫికెట్ అందుకుంటున్న‌ట్టుగా మార్ఫింగ్ ఫోటోని త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేశాడు. ఈ ఫోటోకి నెటిజ‌న్స్ భిన్న ర‌కాలుగా స్పందిస్తున్నారు.

4079
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles