త‌మిళ అర్జున్ రెడ్డి వ‌చ్చేశాడు- టీజ‌ర్

Sun,September 23, 2018 11:39 AM

ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సైలెంట్‌గా వ‌చ్చి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన తెలుగు చిత్రం అర్జున్ రెడ్డి. ఈ మూవీ త‌మిళంతో పాటు హిందీలో రీమేక్ అవుతుంది. త‌మిళంలో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా వర్మ టైటిల్ తో చిత్రం రూపొందుతుంది. బోల్డ్ కంటెంట్ తో సహజత్వ ప్రేమకథగా తమిళంలో రూపొందుతున్న ఈ సినిమాని బాల తెరకెక్కిస్తున్నాడు. నేషనల్ అవార్డు విన్నర్ రాజు మురుగున్ చిత్రానికి డైలాగ్స్ రాస్తున్నాడు. తెలుగులో అర్జున్ రెడ్డి చిత్రం భారీ విజయం సాధించడంతో తమిళంలోను ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ రోజు ధృవ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా చిత్ర ఫ‌స్ట్ లుక్‌తో పాటు టీజ‌ర్ విడుద‌ల చేశారు. టీజ‌ర్‌లోని స‌న్నివేశాలు చూస్తుంటే అచ్చం తెలుగు వ‌ర్షెన్ మాదిరిగానే త‌మిళ వ‌ర్షెన్‌ని బాల తెరకెక్కించాడా అనిపిస్తుంది. ఈ చిత్రంలో ముఖ్య పాత్ర కోసం ఈశ్వరీరావుని ఎంపిక చేశారు. త్వ‌ర‌లో విడుద‌ల కానున్న ఈ సినిమా తెలుగులో మాదిరిగా త‌మిళంలోను భారీ విజ‌యం సాధిస్తుంద‌ని టీం భావిస్తుంది.


3070
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles