'వ‌ర్మ' సినిమాలో హీరోయిన్ కావాల‌నుకుంటున్నారా ?

Tue,November 14, 2017 02:18 PM
varma movie promotion starts

స్టార్ హీరో, పేరున్న దర్శకులు ఎవరూ లేకపోయినా మంచి కాన్సెప్ట్‌తో తెలుగు చిత్రసీమతో పాటు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చిత్రం అర్జున్ రెడ్డి. సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, షాలిని పాండే హీరో హీరోయిన్‌లుగా న‌టించారు. ఇప్పుడు ఈ సినిమా త‌మిళంలో రీమేక్ అవుతుంది. ప్ర‌ముఖ న‌టుడు విక్ర‌మ్ త‌న‌యుడు ధ్రువ‌ హీరోగా వ‌ర్మ అనే టైటిల్‌తో ఈ మూవీని ద‌ర్శ‌కుడు బాల తెర‌కెక్కించ‌నున్నారు. బోల్డ్ కంటెంట్ తో సహజత్వ ప్రేమకథగా త‌మిళంలోను ఈ సినిమాని రూపొందించాల‌ని భావిస్తుండ‌గా, ఇందులో క‌థానాయిక‌గా ఎవ‌రిని ఫిక్స్ చేయాలా అని ఆలోచ‌న‌లో ప‌డ్డారు. ఒక‌వేళ ఈ సినిమాలో హీరోయిన్‌గా మీరే న‌టించాల‌నుకుంటే మ‌మ్మ‌ల్ని సంప్ర‌దించ‌వచ్చు అని అన్నారు. ఇక ఓ వీడియో విడుద‌ల చేసిన వారు అందులో అమ్మాయి మొహం కనిపించకుండా చూపించి... ఇలాంటి లక్షణాలున్న హీరోయిన్‌ కావాలని తెలిపారు.


1128
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS