ప‌ది నిమిషాల్లో వెయ్యి టిక్కెట్లు అమ్ముడ‌య్యాయ‌న్న వ‌ర్మ‌

Wed,March 27, 2019 11:53 AM
varma comments on lakshmis ntr tickets

కేవ‌లం ఒక్క థియేట‌ర్‌లో ప‌ది నిమిషాల‌లో వెయ్యి టిక్కెట్లు అమ్ముడయ్యాయ‌ని, ఈ ఓపెనింగ్స్ స్పీడ్ చూస్తుంటే కథానాయకుడు మహానాయకుడు కన్నా ,లక్ష్మీస్ ఎన్టీఆర్ ని చూడడానికే ప్రజలు ఎగబడుతున్నారు.అంటే నిజంగా నిజమే గెలిచిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు .. జై బాలయ్య అంటూ వ‌ర్మ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. అంతకాదు మ‌హేష్ బాబు మ‌ల్టీ ప్లెక్స్ ఏఎంబీ సినిమాలో బుకింగ్స్‌కి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా షేర్ చేస్తూ.. వీరింద‌రు అస‌లు సిస‌లైన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని వ‌ర్మ పేర్కొన్నారు. మార్చి 29న విడుద‌ల కానున్న ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంకి సంబంధించి వ‌ర్మ చేస్తున్న వెరైటీ ప్ర‌మోష‌న్స్ సినిమాపై మ‌రింత ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. తెలుగు త‌మ్ముళ్ళు ఈ చిత్రానికి అడ్డుప‌డ్డా కూడా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ఈ శుక్ర‌వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. వర్మ, అగస్త్య మంజు కలిసి దర్శకత్వం వహించిన ఈ సినిమాను రాకేష్‌ రెడ్డి, దీప్తి బాలగిరిలు నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ పాత్రలో రంగస్థల నటుడు విజయ్‌ కుమార్ నటిస్తుండగా లక్ష్మీ పార్వతి పాత్రలో యజ్ఞశెట్టి కనిపించనున్నారు. చంద్రబాబు పాత్రలో శ్రీతేజ్‌ నటిస్తున్నాడు.3833
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles