చిరు ఫ్యామిలపై రామ్ గోపాల్ వర్మ యూటర్న్!!

Fri,April 14, 2017 12:18 PM
varma behaviour not understanding to others

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రవర్తన ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి ఓ పంథాన అంతుపట్టడం లేదు. ఒకసారి తిడుతూ వరుస ట్వీట్స్ చేసే ఆయన మరోసారి సారీ చెప్పి అందిరికి షాక్ ఇస్తాడు. ఆ మధ్య పవన్ పై పంచ్ లు వేసిన వర్మ రీసెంట్ గా ఆయనకు క్షమాపణలు చెప్పాడు. వోడ్కా తాగనంటూ చెప్పిన ఈ దర్శకుడు ఇప్పటివరకు వోడ్కా కారణంగా ఇబ్బంది పడిన వినాయకుడి అభిమానులకు.. పవన్ కళ్యాణ్ అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. ఈ విషయాన్ని ఆయన అమ్మ మీద.. దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ మీద.. అమితాబ్ బచ్చన్ మీద ఒట్టేసి మరీ చెప్పాడు. దీంతో అందరు ఒక్కసారి గా షాక్ అయ్యారు. ఇక తాజాగా చిరంజీవిలాంటి అన్నయ్య నాకుంటే మెగా ఫ్యామిలీకి సంబంధించి నేను మాట్లాడిన మాటలకి కొట్టేవాడిని. నాగబాబు గారు మాటలతో వదిలేశారు. ఆయనకి సారీ చెప్తున్నా అని ట్వీట్ చేశాడు. నాగబాబు తనయుడు వరుణ్‌ తేజ్‌ కి కూడా వర్మ క్షమాపణ చెప్పారు. వరుణ్‌ తేజ్‌.. మీ నాన్న గురించి నాపై చేసిన కామెంట్లు చదివాను. నువ్వు చెప్పింది కరెక్ట్. నా మాటలు మిమ్మల్ని బాధ పెట్టినందుకు మీ ఇద్దరికీ క్షమాపణలు చెబుతున్నానంటూ ట్వీట్ చేశాడు వర్మ. మరి రాము ప్రవర్తన లో సడెన్ గా ఇంత మార్పు రావడానికి కారణం ఏంటి అని సినీ లవర్స్ తలలు పట్టుకుంటున్నారు.


1320
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles