సెల‌బ్రేష‌న్‌లో పార్టిసిపేట్ చేయండంటూ వ‌ర్మ పిలుపు

Fri,May 25, 2018 12:24 PM
varma announces officer pre release event date

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, కింగ్ నాగార్జున కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం ఆఫీసర్. 28 ఏళ్ళ క్రితం శివ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన వర్మ- నాగ్ కాంబినేషన్ ఇప్పుడు ఆఫీసర్ చిత్రంతో మరో అద్భుతం క్రియేట్ చేసేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. ఆఫీస‌ర్ చిత్రం జూన్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల కానుండ‌గా, మే 28న చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించ‌బోతున్న‌ట్టు వ‌ర్మ త‌న ట్వీట్ ద్వారా తెలియ‌జేశారు. హైద‌రాబాద్‌లో ఎన్‌కన్వెన్ష‌న్‌లో జ‌ర‌గ‌నున్న ఈ కార్య‌క్ర‌మానికి నాగ్ అభిమానులు అంద‌రూ ఆహ్వానితులే అని వ‌ర్మ త‌న ట్వీట్‌లో తెలిపారు. ఆఫీస‌ర్ చిత్రం కిడ్నిప్ అయిన పాప‌ని ర‌క్షించే నేప‌థ్యంలో రియ‌ల్ పోలీస్ ఆఫీస‌ర్ జీవితమాధారంగా తెర‌కెక్కించిన‌ట్టు తెలుస్తుంది. మైరా సరీన్ అనే కొత్త అమ్మాయి ఈ చిత్రంలో కథానాయికగా నటించింది . బేజీ కావ్యా, ఫిరోజ్‌ అబ్బాసీ, షాయాజీ షిండే, అజయ్‌ తదితరులు కీలక పాత్ర పోషించారు. కంపెనీ బేనర్ పై వర్మ ఈ చిత్రాన్ని నిర్మించాడు. రామ్ గోపాల్ వర్మ, నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన శివ, గోవిందా గోవిందా, అంతం చిత్రాలు భారీ విజయం సాధించడంతో ఆఫీసర్ చిత్రంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.



1502
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS