ప్ర‌భాస్‌కి ఐలవ్యూ చెప్తానంటున్న త‌మిళ భామ !

Thu,February 21, 2019 08:18 AM

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ ప్ర‌భాస్ అతి త్వ‌ర‌లోనే పెళ్ళి పీట‌లెక్క‌నున్నాడు. కొద్ది రోజులుగా ఆయ‌న పెళ్లికి సంబంధించి ప‌లు వార్త‌లు వ‌స్తున్న‌ప్ప‌టికి, దీనిపై ప్ర‌భాస్ కాని ఆయ‌న కుటుంబ స‌భ్యులు కాని స్పందించ‌డం లేదు. అయితే ప్ర‌భాస్ కటౌట్‌ని చూసి ఇష్ట‌ప‌డే అమ్మాయిల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. కేవ‌లం మ‌న రాష్ట్రంలోనే కాదు మిగ‌తా రాష్ట్రాల‌లోను ఆయ‌న‌కి అమ్మాయిల ఫాలోయింగ్ భారీగా ఉంద‌నేది అంద‌రికి తెలిసిన స‌త్యం. త‌మిళంలో ప్ర‌తినాయ‌క పాత్ర‌లు పోషిస్తూ అభిమానుల మ‌న‌సుల‌లో చెర‌గని ముద్ర వేసుకున్న వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ త్వ‌ర‌లో నాగ‌కన్య చిత్రంతో ఇటు తెలుగు, అటు త‌మిళ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా ఆమె ఓ ఇంట‌ర్వ్యూలో ప్ర‌భాస్‌పై తెగ ప్రేమ కురిపించింది. నేను ఎవరికైనా ఐలవ్యూ చెప్పాలనుకుంటే అది బాహుబలి ప్రభాస్‌కే చెబుతానని మనసులో మాటను బయటపెట్టేసింది. గ‌తంలో వ‌ర‌ల‌క్ష్మీని మీరు ముద్దు పెట్టాల్సి వ‌స్తే ఎవ‌రికి పెడ‌తార‌ని అడ‌గ‌గా శింబుకి అని త‌డుముకోకుండా చెప్పింది. ఇక చంపాల్సి వ‌స్తే ఎవ‌రిని చంపుతార‌ని అడ‌గ‌గా నా రూమ‌ర్ ప్రేమికుడు విశాల్‌ని అని స‌ర‌దాగా వ్యాఖ్యానించింది. ఏ విష‌యంలోనైన‌ స్ట్రైట్‌గా మాట్లాడే వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్‌ని చూసి అభిమానులు తెగ ముచ్చ‌ట‌ప‌డుతున్నారు.

2996
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles