అత్తారింటికి దారేది చిత్ర రీమేక్ ట్రైల‌ర్‌కి భారీ రెస్పాన్స్

Tue,January 29, 2019 08:31 AM
Vantha Rajavathaan Varuven trailer released

ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా మార్కెట్ విసృతంగా పెర‌గడంతో టాలీవుడ్‌కి చెందిన ప‌లు సినిమాలు వివిధ భాష‌ల‌లో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెర‌కెక్కిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం ‘అత్తారింటికి దారేది’ ఇప్పుడు త‌మిళంలో రీమేక్ అవుతుంది . ఈ సినిమా పవన్‌కల్యాణ్ కెరీర్‌లోనే మంచి హిట్ చిత్రంగా నిలిచింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తుండ‌గా, సుంద‌ర్ సి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుంది. రీమేక్ చిత్రంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాత్ర‌లో శింబు న‌టిస్తుండ‌గా, ఆయ‌నకి జోడీగా మేఘా ఆకాశ్ న‌టిస్తుంది. మ‌రో క‌థానాయిక‌గా కేథరిస్ థెరిస్సా న‌టించింది. ‘వంత రాజ‌వ‌థాన్ వ‌రువెన్’ అనే పేరుతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 1న విడుద‌ల చేయ‌నున్నారు. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌డంతో మేక‌ర్స్ చిత్ర ప్ర‌మోష‌న్ స్పీడ్ పెంచారు. తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేయ‌గా, ఈ ట్రైల‌ర్‌కి భారీ రెస్పాన్స్ వ‌స్తుంది. త‌మిళ నేటివిటికి త‌గ్గ‌ట్టుగా రీమేక్ చేసిన‌ట్టు తెలుస్తుంది. హిప్‌ హాప్‌ తమీజా చిత్రానికి సంగీతాన్నిఅందించారు. ఈ చిత్ర విడుద‌ల త‌ర్వాత శింబు దర్శకుడు వెంకట్‌ప్రభు దర్శకత్వంలో మానాడు అనే చిత్రం, గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో విన్నైతాండి వరువాయా- 2 చిత్రాలలో నటించేందుకు సిద్ధ‌మ‌య్యాడు .

3641
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles