'అత్తారింటికి దారేది' రీమేక్ టీజ‌ర్ విడుద‌ల‌

Sat,December 1, 2018 12:45 PM
Vantha Rajavathaan Varuven teaser released

ప‌వ‌ర్ స్టార్ కళ్యాణ్‌- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం అత్తారింటికి దారేది. ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎంత‌టి భారీ విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న్క‌ర్లేదు. సెంటిమెంట్‌, కామెడీ, ఎమోష‌న్స్‌తో కూడిన ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని త‌మిళంలో రీమేక్ చేస్తున్నారు. స్టార్ డైరెక్ట‌ర్ సుంద‌ర్‌.సి ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళ రీమేక్ తెర‌కెక్కుతుండ‌గా, ప‌వ‌న్ పాత్ర‌ని శింబు చేస్తున్నాడు . తొలిసారి సుంద‌ర్‌- శింబు జ‌త‌క‌ట్ట‌డంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. దీపావ‌ళి సంద‌ర్భంగా చిత్ర ఫ‌స్ట్ లుక్‌తో పాటు టైటిల్ రివీల్ చేసింది చిత్ర బృందం. వంత రాజ‌వ‌థాన్ వ‌రువెన్ అనే టైటిల్‌ని చిత్రానికి ఫిక్స్ చేశారు.

వంత రాజ‌వ‌థాన్ వ‌రువెన్ చిత్రంలో శింబు స‌ర‌స‌న మేఘా ఆకాశ్‌, కేథ‌రిన్ థెస్రా క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. తాజాగా చిత్ర టీజ‌ర్ విడుద‌లైంది. ఇందులో స‌న్నివేశాలు తెలుగు వ‌ర్షెన్ మాదిరిగానే ఉండ‌డంతో టాలీవుడ్ ప్రేక్ష‌కులు కూడా ట్రైల‌ర్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. తెలుగు వ‌ర్షెన్‌లో నదియా పోషించిన ‘సునంద’(అత్త) పాత్రని తమిళంలో ర‌మ్య‌కృష్ణ పోషిస్తున్నారు. ప్ర‌భు, నాజ‌ర్‌, యోగిబాబు, మోట్టా రాజేంద్ర‌న్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. హిప్ హాప్ త‌మీజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్ సంస్థ నిర్మిస్తుంది.

2428
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles