సినీ నటుడు వంకాయల సత్యనారాయణ కన్నుమూత

Mon,March 12, 2018 01:54 PM
Vankayala satyanarayana Passes away

హైదరాబాద్ : ప్రముఖ సీనియర్ సినీ నటుడు వంకాయల సత్యనారాయణ (78) కన్నుమూశారు. శ్వాససంబంధ సమస్యతో బాధపడుతున్న సత్యనారాయణ ఇవాళ తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబసభ్యులు వెల్లడించారు. సత్యనారాయణ 1940లో విశాఖపట్నంలోని చవల వారి వీధిలో జన్మించారు. ఆయన కొంతకాలంగా విశాఖలోని కుమార్తె ఇంట్లో ఉంటున్నారు. సత్యనారాయణ ‘నీడలేని ఆడది’ సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. సీతామాలక్ష్మీ, శ్రీనివాస కల్యాణం, శుభలేఖ, దొంగ కోళ్లు, ఊరికి ఇచ్చినమాట, విజేత వంటి చిత్రాలతోపాటు సుమారు 150కిపైగా చిత్రాల్లో నటించారు.

3688
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles