4 సీన్ల కోసం రూ.40 లక్షలు రెమ్యునరేషన్..!

Thu,August 10, 2017 10:30 PM
Vani Vishwanath gets Rs.40 lakh for Jaya Janaki Nayaka


హైదరాబాద్: టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన లేటెస్ట్ మూవీ జయ జానకి నాయక. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 11న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నది. జయ జానకి నాయక లో కీలక పాత్ర కోసం అలనాటి హీరోయిన్ వాణీ విశ్వనాథ్‌ను ఎంపిక చేశాడు బోయపాటి. కథానుగుణంగా వాణీ విశ్వనాథ్ రోల్ సినిమాకే హైలెట్ ఉంటుందట. ఈ పాత్రకున్న ఇంపార్టెన్స్ వల్ల కేవలం నాలుగు సీన్లకే భారీ మొత్తం పెట్టిందట చిత్రయూనిట్. వాణీ విశ్వనాథ్ నాలుగు సీన్ల కోసం రూ.40 లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ఫిలింనగర్ వర్గాలు పేర్కొన్నాయి. శ్రీనివాస్‌కు జోడీగా రకుల్‌ప్రీత్‌సింగ్ నటిస్తుండగా..ప్రగ్యా జైశ్వాల్ కీలక పాత్రలో నటిస్తుంది. కేథరిన్ స్పెషల్‌సాంగ్‌లో కనిపించనుంది.

2192
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles