ట్రైల‌ర్ క‌ట్ ముగిసింది.. విడుద‌లే త‌రువాయి

Sun,September 8, 2019 08:58 AM
Valmiki trailer release very soon

మ‌రి కొద్ది రోజుల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న మాస్ థ్రిల్ల‌ర్ చిత్రం వాల్మీకి. సెప్టెంబ‌ర్ 20న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌చ్చే ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌గా, వ‌చ్చే వారంలో ట్రైల‌ర్ రిలీజ్‌కి స‌న్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ట్రైల‌ర్ క‌ట్ కూడా పూర్తి చేశారు. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియజేశాడు. గ‌డ్డ‌ల కొండ గ‌ణేష్ పాత్ర‌లో వ‌రుణ్ అద‌ర‌గొడ‌తాడ‌ని, ట్రైల‌ర్ కోసం ఆసక్తిగా ఎద‌రు చూస్తున్నాన‌ని హ‌రీష్ పేర్కొన్నారు. కోలీవుడ్ సూప‌ర్ హిట్ జిగ‌ర్తాండ‌కి రీమేక్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. చిత్రంలో వ‌రుణ్ లుక్స్ చూస్తుంటే సినిమా ఓ రేంజ్‌లో ఉంటుంద‌నే అభిప్రాయానికి వ‌స్తున్నారు అభిమానులు. మాస్ ప్రేక్ష‌కుల‌కి ఈ చిత్రాన్ని మ‌రింత ద‌గ్గ‌ర‌గా చేర్చేందుకు ఇందులో ఒక ఐట‌మ్ సాంగ్‌ని కూడా పెడుతున్నారు. ఈ ఐట‌మ్ సాంగ్‌లో డింపుల్ హ‌యాతి అనే తెలుగ‌మ్మాయి త‌న స్టెప్పుల‌తో అద‌ర‌గొట్ట‌నుంద‌ట‌. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. 14 రీల్స్ సంస్థపై రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


2491
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles