వాల్మీకిగా వ‌రుణ్ తేజ్

Sun,January 27, 2019 09:01 AM
Valmiki title logo released

మెగా హీరో వ‌రుణ్ తేజ్‌ సెల‌క్టివ్ క‌థాంశాల‌ని ఎంచుకుంటూ వ‌రుస హిట్స్‌తో దూసుకెళుతున్నాడు. రీసెంట్‌గా ఎఫ్ 2 అనే చిత్రంతో భారీ హిట్ కొట్టిన వ‌రుణ్ తేజ్ త్వ‌ర‌లో హ‌రీష్ శంక‌ర్‌తో క‌లిసి క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నున్నాడు. తాజాగా ఈ చిత్ర టైటిల్ లోగోని విడుద‌ల చేశారు. వాల్మీకి అనే టైటిల్‌తో మూవీ రూపొంద‌నుండ‌గా చిత్రానికి దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం స‌మ‌కూర్చ‌నున్నారు.

డీజే చిత్రం త‌ర్వాత ఏ ఒక్క సినిమాని ప‌ట్టాలెక్కించ‌ని హ‌రీష్ శంక‌ర్ కోలీవుడ్ సూప‌ర్ హిట్ మూవీ జిగ‌ర్తాండ్రా చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌బోతున్నట్టు కొన్నాళ్ళుగా వార్త‌లు వ‌స్తున్నాయి. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని 14 రీల్స్ నిర్మించ‌నుంది. ఇందులో నాగ శౌర్య కూడా ముఖ్య పాత్ర పోషించ‌నున్న‌ట్టు స‌మాచారం. తెలుగు నేటీవిటికి త‌గ్గ‌ట్టుగా హ‌రీష్ శంక‌ర్ స్క్రిప్ట్‌ని సిద్దం చేసుకోగా వ‌చ్చే నెల‌లో ఈ ప్రాజెక్ట్‌ సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ట‌. చిత్ర తారాగ‌ణం, సాంకేతిక నిపుణులు త‌దిత‌ర వివరాలు త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నారు. జిగ‌ర్తాండ్రా చిత్రం కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌గా, ఈ చిత్రం పలు జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకుంది.

2999
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles