శివుని ఆశీస్సుల‌తో.. అద్భుత‌మైన ప్ర‌దేశంలో వాల్మీకి షూటింగ్

Thu,June 13, 2019 01:44 PM

వ‌రుణ్ తేజ్, హ‌రీష్ శంకర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం వాల్మీకి. త‌మిళ చిత్రం జిగ‌ర్తాండ‌కి రీమేక్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ తాజాగా ప్ర‌ముఖ శివ క్షేత్రం యాగంటిలో జ‌రుపుకుంటుంది. ఈ విష‌యాన్ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపాడు. షూటింగ్ లొకేష‌న్‌కి సంబంధించిన ఫోటో షేర్ చేస్తూ.. ‘శివుని ఆశీసులలో ఈ అద్భుతమైన ప్రదేశంలో షూటింగ్ మొదలుపెట్టాం’ అని సందేశం ద్వారా తెలిపారు. ఈ షెడ్యూల్‌లో వ‌రుణ్ తేజ్‌తో పాటు బ్ర‌హ్మాజీ, పూజా హెగ్డే పాల్గొంటార‌ని తెలుస్తుంది. ఈ షెడ్యూల్ కోసమే వ‌రుణ్ నిన్న హైద‌రాబాద్ నుండి బ‌య‌లు దేర‌గా వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని రాయినిపేట వద్ద ప్ర‌మాదం జరిగింది. ఇండికా కారు వ‌రుణ్ తేజ్ ప్రయాణిస్తున్న ఆడికారుని ఢీకొట్ట‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. స్వ‌ల్ప గాయాల‌తోనే వ‌రుణ్ పెద్ద ప్ర‌మాదం నుండి బ‌య‌ట‌ప‌డ్డాడు. వాల్మీకి చిత్రాన్ని ఆచంట రాము, గోపినాథ్ లు 14రీల్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ సంగీతం సమకూరుస్తున్నారు.
2820
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles