'వాల్మీకి' ప్రీ టీజర్.. అదిరిపోయిన వరుణ్ లుక్

Mon,June 24, 2019 06:33 PM
Valmiki Pre Teaser released

వరుణ్ తేజ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా వాల్మీకి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. వినాయకచవితి కానుకగా సెప్టెంబర్ 6న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ టీజర్ ఇవాళ రిలీజ్ అయింది.

ప్రీ టీజర్‌లో వరుణ్ లుక్ అదిరిపోయింది. ఎఫ్2 బ్లాక్‌బస్టర్ తర్వాత వరుణ్ నటిస్తున్న సినిమా కావడం.. హరీశ్ శంకర్‌తో జతకడుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాను రామ్ అచంట, గోపి అచంట నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్.

తమిళంలో వచ్చిన జిగర్తాండ సినిమాకు ఈ సినిమా రీమేక్. కాగా.. ఈ సినిమాలో ప్రీ టీజర్‌లో చూపించినట్టుగానే వరుణ్‌ను డిఫరెంట్ రోల్‌లో చూపిస్తున్నారట.

989
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles