సెట్స్ పైకి వెళ్లిన 'వాల్మీకి'.. టీంతో జాయిన్ కానున్న వ‌రుణ్‌

Thu,April 18, 2019 12:03 PM
Valmiki Movie day 1 shoot

కెరీర్‌లో ఆచితూచి అడుగులేస్తున్న యువ హీరో వ‌రుణ్ తేజ్‌. చివ‌రిగా ఎఫ్ 2 అనే చిత్రంతో ఆడియ‌న్స్‌కి మంచి వినోదాన్ని అందించిన వ‌రుణ్ త‌న త‌దుప‌రి చిత్రంగా వాల్మీకి అనే చిత్రం చేస్తున్నాడు. గ‌బ్బ‌ర్ సింగ్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతుంది. 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త‌మిళంలో హిట్ అయిన జిగ‌ర్తాండ్రా మూవీకి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. కొద్ది రోజులుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్యక్ర‌మాలు జ‌రుపుకున్న ఈ చిత్రం నేడు సెట్స్ పైకి వెళ్లింది.

వాల్మీకి షూటింగ్ నేటి నుండి మొద‌లు కానుంది. ఈ చిత్రం కోసం చాలా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను అని వ‌రుణ్ త‌న ట్వీట్‌లో తెలిపారు. వాల్మీకి చిత్రంతో తమిళ నటుడు అథర్వ మురళి తెలుగు సినీపరిశ్రమలోకి అడుగుపెడుతున్నాడు. గ్యాంగ్‌స్టర్ కామెడీ నేపథ్యంలో వస్తున్న వాల్మీకి ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకురానుంది. మృణాళిని రవిని వాల్మీకిలో హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. కాగా, కిరణ్‌ కొర్రపాటి అనే నూతన దర్శకుడు డైరెక్ష‌న్‌లోను వ‌రుణ్ ఓ చిత్రం చేయ‌నున్నాడు. ఈ చిత్రం థ్రిల్ల‌ర్ స్పోర్ట్స్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కనుండ‌గా, ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా కనిపించేందుకు ఒలింపిక్‌ విన్నర్‌ టోని జెఫ్రీస్‌ పర్యవేక్షణలో శిక్ష‌ణ పొందాడు వ‌రుణ్‌.

1395
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles