పూజా కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న వాల్మీకి

Sun,January 27, 2019 10:26 AM
valmiki launched

వ‌రుణ్ తేజ్- హ‌రీష్ శంక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఓ చిత్రం తెర‌కెక్క‌నుంద‌ని ఎప్ప‌టి నుండో జోరుగా ప్రచారం జ‌రుగుతుంది. ఈ వార్త‌ల‌ని నిజం చేస్తూ వ‌రుణ్ తేజ్ కొద్ది సేప‌టి క్రితం వాల్మీకి టైటిల్ లోగో పోస్టర్ విడుద‌ల చేశాడు. ఇక చిత్రానికి సంబంధించిన లాంచింగ్ కార్య‌క్ర‌మం కూడా గ్రాండ్‌గానే జ‌రిపారు. వివి వినాయ‌క్, సుకుమార్ , దిల్ రాజుతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు పూజా కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. వ‌రుణ్ తేజ్ సోద‌రి నిహారిక క్లాప్ కొట్టింది. మ‌రి కొద్ది రోజుల‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. త‌మిళంలో సూప‌ర్ హిట్ చిత్రం జిగ‌ర్తాండ్రా చిత్రానికి రీమేక్‌గా వాల్మీకి రూపొందుతుంద‌ని అంటున్నారు. త‌మిళంలో బాబీ సింహా పోషించిన పాత్ర‌ని తెలుగులో వ‌రుణ్ తేజ్ చేయ‌నున్నాడ‌ట‌. జిగ‌ర్తాండ్రా చిత్రం పలు జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకున్న విష‌యం విదిత‌మే. 14 రీల్స్ ప్ల‌స్ ప్రొడ‌క్షన్ నిర్మాణంలో ఈ సినిమా రూపొంద‌నుంది.



2212
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles