వేలంటైన్స్ డే స్పెష‌ల్ స‌ర్‌ప్రైజెస్‌

Wed,February 14, 2018 10:36 AM
Valentines Day special surprises

మ‌నసు పలికేది మౌనగీతం.. మనిషి కోరేది ప్రేమ హృదయం. జీవితంలో ఏదోక దశలో ఎవరినైనా ప్రేమించని మనిషంటూ ఉండడు. ఈ లోకం ప్రేమతోనే నడుస్తోంది. నిజం చెప్పాలంటే .. ప్రేమ అనేది దైవత్వం, అది అజరామరం. లవ్ ఈజ్ ఫరెవర్. ప్రేమ దేవుడంత మహోన్నతమైంది. అది అలౌకికమైన అద్భుత సౌమ్య సౌందర్యం. ప్రేమను పొందడం వరం. ఎవరి ప్రేమకూ నోచుకోకపోవడం అంతులేని విషాదం. ప్రేమలేని మనిషి లేడు. ప్రేమలేని జీవితం లేదు. ప్రేమలేని లోకం లేదు. ... మృదుమధురమైన ప్రేమ ఒక గొప్ప శక్తి. మనిషి జీవితంలో ప్రేమ ఒక అనుభూతి. ఒక తపన, ఒక ఆర్తి. ఆవేదన. మనకంటూ ఒక మనిషి కావాలనే తపనే ప్రేమ. తను ప్రేమించిన మనిషికోసం ప్రేమికులు ఏదైనా చేస్తారు. ప్రేమతో ఏదైనా చెబితే అది శాసనమే. ప్రేమించిన మనిషికోసం కన్నవారిని కూడా వదిలి వచ్చేస్తున్నారంటే అది ఎంత బలమైందో అర్థమవుతుంది.

మనకోసం కన్నీళ్లు కార్చే ఒక్క మనిషి .. ..ఒకే ఒక్క మనిషి ఎవరైనా ఉన్నారంటే అది మనల్ని నిజంగా ప్రేమించిన వ్యక్తి. మనం బాధలో, దుఃఖంలో ఉన్నప్పుడు మనల్ని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని నీకు నేనున్నాను. నీ కన్నీళ్లు తుడుస్తాను. నీ బాధను పంచుకుంటాను. నా జీవితం నీది. నీ కష్టాలు నావి అని మనస్ఫూర్తిగా చెప్పే మనిషి దొరికితే అంతకు మించి కోరేది ఏముంటుంది? జీవితంలో నిజమైన ప్రేమ దొరికినప్పుడు ఇంకేదీ కోరాలనిపించదు. ఇంకేదీ కావాలనిపించదు. ఈ జీవితానికి ఇది చాలు అనిపిస్తుంది. మనసుతో చూడాలే కానీ .. .. ప్రేమలో లేనిది లేదు. మనకు, మనసుకు దొరకనిది లేదు. ప్రేమలో ఆనందం ఉంది. ఆవేదన ఉంది. ఆలోచన ఉంది. ప్రేమను పొందితే విజయం. విఫలమైతే విషాదం. విచిత్రమేమిటంటే లక్షలాది మందిలో ఏ ఒక్కరికో దాని విలువ తెలుస్తుంది. అర్థమవుతుంది. ప్రేమ ఎంతో గొప్ప‌ది. అయితే ఈ రోజు వేలంటైన్స్ డే సంద‌ర్భంగా ఇండ‌స్ట్రీలో ప‌లు సినిమాల‌కి సంబంధించి ఫ‌స్ట్ లుక్స్‌తో పాటు ప్రీ లుక్స్‌తో స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. వాటిపై మీరు ఓ లుక్కేయండి.
1918
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles