స‌రికొత్త బ్యాక్‌డ్రాప్‌లో తేజూ సోద‌రుడి మూవీ ..!

Tue,February 5, 2019 09:51 AM
Vaishnav Tej comes with new story line

సాయిధ‌ర‌మ్ తేజ్ సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్ త్వ‌ర‌లో వెండితెర‌పై సంద‌డి చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న డెబ్యూ మూవీ ఇటీవ‌ల అఫీషియ‌ల్‌గా లాంచ్ కాగా త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ చిత్రానికి బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సుకుమార్ కథను అందించారు . రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. స‌రికొత్త క‌థాంశంతో ఈ మూవీ రూపొంద‌నుంద‌ని తెలుస్తుంది. బెస్త‌వాళ్ళ బ్యాక్‌డ్రాప్‌లో మూవీ తెర‌కెక్కుతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా ఇందులో వైష్ణ‌వ్ బెస్తవాడిగా క‌నిపిస్తాడ‌ట‌. రంగ‌స్థ‌లం లాంటి ఎమోష‌న‌ల్ మూవీలా ఈ చిత్రం ఉంటుంద‌ని అంటున్నారు. ఈ చిత్రానికి శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహించనున్నారు. అలాగే ‘రంగస్థలం’ ఫేమ్ రామకృష్ణ మౌనిక ఆర్ట్ డిపార్ట్ మెంట్ ను చూసుకుంటుండగా… నవీన్ నూలి ఎడిటర్ గా చేస్తున్నారు. వైష్ణవ్ తేజ్ గతంలో చిరు నటించిన శంకర్ దాదా జిందాబాద్ చిత్రంలో పేషెంట్ గా నటించాడు. జానీ సినిమాలో చిన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌గా కూడా న‌టించాడు. ఇప్పుడు హీరోగా ఎలా అల‌రిస్తాడో చూడాలి.

1542
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles