త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై స్పందించిన వైర‌ముత్తు

Thu,October 11, 2018 08:53 AM
Vairamuthu comments on allegations

ప‌ద్మభూష‌ణ్ అవార్డుతో పాటు ప‌లు జాతీయ అవార్డులు అందుకున్న ర‌చ‌యిత వైర‌ముత్తు. ఎన్నో విజ‌యవంత‌మైన చిత్రాలకి పాట‌లు రాసిన వైర‌ముత్తుపై ఇటీవ‌ల అనేక లైంగిక ఆరోప‌ణ‌లు వచ్చిన సంగ‌తి తెలిసిందే. త‌న ద‌గ్గ‌ర ప‌నిచేసే యువ‌తితో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని, కౌగిలించుకోవ‌డం , వెకిలి చేష్ట‌ల‌తో ఆ యువ‌తిని భ‌య‌బ్రాంతుల‌కి గురి చేశాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ కం సింగ‌ర్ చిన్మయి శ్రీ పాద కూడా వైర‌ముత్తుపై ఆరోప‌ణ‌లు చేసింది. హోట‌ల్ గ‌దికి ర‌మ్మ‌ని త‌న‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని చెప్పుకొచ్చింది. ఈ ఆరోప‌ణ‌లని వైర‌ముత్తు ఖండించారు. అమాయ‌కుల‌ని అవ‌మానించ‌డం ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రికి ఫ్యాష‌న్ అయింద‌ని, స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు నిజం అంద‌రికి తెలుస్తుంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఇప్ప‌టికే చాలా మంది త‌నపై ప‌లు ఆరోప‌ణ‌లు చేశార‌ని , ఇలాంటివి తాను అస‌లు ప‌ట్టించుకోనని స్ప‌ష్టం చేశాడు వైర‌ముత్తు. ప్ర‌స్తుతం మీటూ ఉద్య‌మం ఇండియాలో ఉదృతంగా సాగుతున్న దశ‌లో ప‌లువురి ప్ర‌ముఖుల పేర్లు బ‌య‌ట‌కు వ‌స్తుండడం సంచ‌ల‌నం సృష్టిస్తుంది. మ‌రి వైర‌ముత్తు కామెంట్స్ పై చిన్మ‌యి ఎలా స్పందిస్తుందో చూడాలి.

1163
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS