త‌ప్పు చేస్తే శిక్ష‌కి సిద్ధం: వైర‌ముత్తు

Tue,October 16, 2018 10:21 AM
vairamuthi video on me too

ప‌ద్మభూష‌ణ్ అవార్డుతో పాటు ప‌లు జాతీయ అవార్డులు అందుకున్న ర‌చ‌యిత వైర‌ముత్తు. ఎన్నో విజ‌యవంత‌మైన చిత్రాలకి పాట‌లు రాసిన వైర‌ముత్తుపై ఇటీవ‌ల అనేక లైంగిక ఆరోప‌ణ‌లు వచ్చిన సంగ‌తి తెలిసిందే. త‌న ద‌గ్గ‌ర ప‌నిచేసే యువ‌తితో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని, కౌగిలించుకోవ‌డం , వెకిలి చేష్ట‌ల‌తో ఆ యువ‌తిని భ‌య‌బ్రాంతుల‌కి గురి చేశాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ కం సింగ‌ర్ చిన్మయి శ్రీ పాద కూడా వైర‌ముత్తుపై ప‌లు ఆరోప‌ణ‌లు చేసింది. హోట‌ల్ గ‌దికి ర‌మ్మ‌ని త‌న‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని చెప్పుకొచ్చింది. ఈ ఆరోప‌ణ‌లని వైర‌ముత్తు ఖండించారు. ఓ వీడియో ద్వారా త‌న‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌లు అవాస్త‌వం అని అన్నాడు. ‘నాపై వస్తున్న ఆరోపణలు అన్ని అబద్ధాలు. అవి నిజమైతే.. ఆ మహిళలు నాపై కేసు పెట్టొచ్చు. చట్టపరంగా దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. నేను మంచివాడినో, చెడ్డవాడినో ఒకరు చెప్పనక్కర్లేదు. న్యాయస్థానమే దాన్ని నిర్ణయిస్తుంది. కోర్టు తీర్పును నేను స్వాగతిస్తాను’ అని చెప్పారు. ప్ర‌స్తుతం మీటూ ఉద్య‌మం ఇండియాలో ఉదృతంగా సాగుతున్న దశ‌లో ప‌లువురి ప్ర‌ముఖుల పేర్లు బ‌య‌ట‌కు వ‌స్తుండడం సంచ‌ల‌నం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

734
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS