షూటింగ్ లో గాయ‌ప‌డ్డ క‌మెడీయ‌న్..!

Wed,July 5, 2017 02:55 PM
Vadivelu injured in mersal shooting

ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ థేరి సినిమా త‌ర్వాత అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న చిత్రం మెర్స‌ల్. విజ‌య్ 61వ మూవీగా తెర‌కెక్కుతున్న చిత్రం త‌మిళం, తెలుగు భాష‌ల‌లో విడుద‌ల కానుంది. తెలుగులో అదిరింది అనే టైటిల్ తో చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. ఇటీవ‌ల ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుదల కాగా వీటికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. నిత్యామీన‌న్, కాజ‌ల్ అగ‌ర్వాల్, స‌మంత క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఒడివేలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. గ‌తంలో వ‌చ్చిన‌ పొక్కిరి, ఫ్రెండ్స్, భాగ‌వ‌తి, విల్లు చిత్రాల‌లో విజ‌య్ తో క‌లిసి ప‌నిచేశాడు ఒడివేలు. ప్ర‌స్తుతం మెర్స‌ల్ లోను ప‌నిచేస్తున్న ఈ వ‌ర్స‌టైల్ ఆర్టిస్ట్ షూటింగ్ లో గాయ‌ప‌డ్డాడ‌ట‌. ఓ సాంగ్ సీక్వెన్స్ తెర‌కెక్కిస్తుండ‌గా ఒడివేలు గాయ‌ప‌డ్డాడ‌ని, అది చిన్న గాయ‌మేన‌ని తెలుస్తుంది . స్మాల్ ట్రీట్మెంట్ త‌ర్వాత ఒడివేలు తిరిగి షూటింగ్ లో పాల్గొన‌నున్నాడ‌ని కోలీవుడ్ మీడియా చెబుతుంది. శ్రీ తేనాండాళ్‌ ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తున్న మెర్స‌ల్ చిత్రంలో ఎస్ జే.సూర్య, సత్యరాజ్, సత్యన్, కోవైసరళ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

2182
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles