ఫ‌స్ట్ లుక్‌తో ఆక‌ట్టుకున్న ధ‌నుష్‌

Thu,March 8, 2018 11:08 AM
Vada Chennai  First Look Poster Released

న‌టుడు, నిర్మాత‌, ద‌ర్శ‌కుడిగా రాణిస్తున్న ధ‌నుష్ ప్ర‌స్తుతం వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌డ చెన్నై అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కొద్ది సేప‌టి క్రితం చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. అంబు త‌న పేరు మాత్ర‌మే కాదు అనే క్యాప్ష‌న్ ఫ‌స్ట్ లుక్‌లో క‌నిపిస్తుంది. నార్త్ మ‌ద్రాస్ కి చెందిన గ్యాంగ్ స్ట‌ర్ నేష‌న‌ల్ క్యారెమ్ ప్లేయ‌ర్‌గా ఎలా మారాడ‌నే క‌థ‌తో ఈ చిత్రం రూపొందుతున్న‌ట్టు తెలుస్తుంది. వ‌డ చెన్నై చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా, రీసెంట్‌గా తొలి షెడ్యూల్ పూర్తి చేశారు. పాత్ర‌ల‌కి సంబంధించి ఒక్కో పోస్ట‌ర్ విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. ఈ సినిమాపై అభిమానుల‌లో హ్యూజ్ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. మ‌రోవైపు ధ‌నుష్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న కాలా చిత్రాన్ని త‌న ఓన్ బేన‌ర్ వండ‌ర్ బార్ ఫిలింస్ ప‌తాకంపై నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.


1813
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles