వ‌చ్చిండే.. వీడియో సాంగ్‌కి రికార్డ్ వ్యూస్

Sun,January 6, 2019 08:07 AM

అమెరికా అబ్బాయి, తెలంగాణ అమ్మాయి మధ్య జరిగే ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ఫిదా . శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఫిదా మూవీ బాక్సాపీస్ వద్ద కలెక్షన్లను సృష్టించింది. ముఖ్యంగా ఈ చిత్రంలో ‘వచ్చిండే.. మెల్లామెల్లగా వచ్చిండే..’ అంటూ సింగర్ మధుప్రియ గానానికి సాయిపల్లవి, తన నృత్యంతో అందరినీ ఫిదా చేసింది. ఈ పాట ఇప్పుడు సౌత్ సినీ ఇండస్ట్రీలో టాప్ రికార్డును సొంతం చేసుకుంది. శక్తికాంత్ సంగీతం సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రించింది. ఇప్ప‌టికి ఫంక్ష‌న్స్‌లోను ఈ సాంగ్ త‌న హ‌వా కొన‌సాగిస్తుంది. తాజాగా ఈ పాటకు సంబంధించిన వీడియో సాంగ్ యూట్యూబ్‌లో వేగంగా.. అత్యధిక వ్యూస్‌ రాబట్టిన లిస్ట్‌లో రికార్డును క్రియేట్ చేసింది. ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ చానెల్లో ఈ పాట 173 మిలియన్ల వ్యూస్‌ను రాబట్టి.. తెలుగు పాటకు ఉన్న గొప్పతనాన్ని చాటిచెప్పింది. దీంతో తెలుగువారంతా గర్వపడే సందర్భం ఇదంటూ.. చిత్రయూనిట్‌‌పై నెటిజన్లు అభినందనల వర్షం కురిపిస్తున్నారు.
2808
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles