ఈ సాంగ్ తో మెగా ఫ్యాన్స్ ఫిదా

Sat,July 1, 2017 10:15 AM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, గాడ్జియస్ బ్యూటీ సాయి పల్లవి ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం ఫిదా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జూలై 21న విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో టీం వినూత్న ప్రమోషన్ కార్యక్రమాలు చేపడుతుంది. ఆ మధ్య ట్రైలర్ ని విడుదల చేసి మూవీ పై భారీ అంచనాలు పెంచిన టీం తాజాగా "వచ్చిండే.. మెల్ల మెల్లగా వచ్చిండే.. క్రీమ్ బిస్కెట్ వేసిండే.. " అనే సాంగ్ విడుదల చేశారు. ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ అందించగా మధుప్రియ, రాంకీ ఈ పాట పాడారు. శక్తికాంత్ కార్తిక్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ పాట మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. మరి మీరు ఈ సాంగ్ విని ఎంజాయ్ చేయండి.

5149
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles