గీత గోవిందం 'వ‌చ్చింద‌మ్మా..' ఫుల్ వీడియో సాంగ్ విడుద‌ల‌

Sun,October 7, 2018 10:12 AM

విజయ్ దేవరకొండ, రష్మిక మందాన‌ ప్రధాన పాత్రలలో పరశురాం తెరకెక్కించిన చిత్రం గీత గోవిందం. ఆగస్ట్ 15న విడుదలైన ఈ చిత్రం ఇంటా బయట రచ్చ చేసింది. తెలుగు రాష్ట్రాల‌లోనే కాక ఓవర్సీస్ లోను ఈ మూవీ భారీగా వసూళ్లు రాబట్టింది. చిరంజీవి, రాజమౌళి, మహేష్ బాబు, స‌మంత‌, రామ్ చ‌ర‌ణ్ , అల్లు అర్జున్ తదితరులు సినిమాపై ప్రశంసలు కురిపించారు. గీతా ఆర్ట్స్ 2 బేన‌ర్‌పై బ‌న్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఇంత భారీ విజ‌యం సాధించినందుకు చిత్ర యూనిట్ చాలా హ్యాపీగా ఫీలైంది. గోపి సుంద‌ర్ అందించిన సంగీతం కూడా చిత్ర విజ‌యంలో స‌గ భాగం అయింది. తాజాగా చిత్రం నుండి వ‌చ్చింద‌మ్మా అనే సాంగ్ వీడియో విడుద‌ల చేశారు. ఎంతో క‌ల‌ర్‌ఫుల్‌గా , మ‌న సాంప్ర‌దాయానికి ద‌గ్గ‌ర‌గా చిత్రీకరించిన ఈ సాంగ్‌కి హ్యూజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. మీరు ఆ సాంగ్ చూసి ఎంజాయ్ చేయండి.


4080
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles