దేవ‌దాస్ పాపుల‌ర్ సాంగ్ వీడియో

Tue,November 6, 2018 09:12 AM
Vaaru Veeru Full Video Song released

బాలీవుడ్ రచయిత శ్రీరామ్ రాఘవన్ అందించిన మూలకథని బేస్ చేసుకొని దేవ‌దాస్ అనే చిత్రాన్ని తెర‌కెక్కించాడు శ్రీరామ్ ఆదిత్య‌. క‌థ‌ని తెరపై అద్భుతంగా ఆవిష్కరించడంలో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య విజ‌యం సాధించారు. నాని, నాగార్జున ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన దేవ‌దాస్ చిత్రం మంచి స‌క్సెస్‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ల‌వ‌ర్షం కురిపించింది. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీతం అందించ‌గా, క‌థానాయిక‌లుగా ఆకాంక్ష సింగ్ , ర‌ష్మిక మంద‌న్నా న‌టించారు. అరవై ఏళ్ల వయసులో కూడా తన ఎనర్జీతో ఆకట్టుకున్నారు నాగార్జున. తనదైన శైలి నటనతో దేవ పాత్రకు ప్రాణంపోశారు. డాక్టర్ దాస్‌గా నాని పాత్ర ఆద్యంతం వినోదాల్ని పంచుతుంది. కామెడీ టైమింగ్, సహజ అభినయంతో ఈ పాత్రలో ఇమిడిపోయారు. వారిద్దరి మధ్య వచ్చే ప్రతి సన్నివేశం సినిమాను నిలబెట్టింది. తాజాగా చిత్రం నుండి వారు వీరు అనే సాంగ్ ఫుల్ వీడియో విడుద‌ల చేశారు. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

1309
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles