ఛ‌ల్ మోహ‌న్ రంగ సెకండ్ సింగిల్ సాంగ్ విడుద‌ల‌

Sat,March 3, 2018 10:36 AM

శ్రేష్ట్‌ మూవీస్ పతాకంపై నితిన్ 25వ సినిమాగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెర‌కెక్కిన చిత్రం ఛ‌ల్ మోహ‌న్ రంగ‌. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవ‌ల చిత్ర టీజ‌ర్ విడుద‌ల కాగా, దీనికి సూప‌ర్భ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక రీసెంట్‌గా ఫ‌స్ట్ సాంగ్ విడుద‌ల అయింది. ఘ.. ఘ.. మేఘా.. అంటూ సాగే ఈ సాంగ్ మ్యూజిక్ ల‌వ‌ర్స్‌కి మ‌త్తెక్కించింది. తాజాగా వారం కాని వారం అంటూ సాగే పాట‌ని విడుద‌ల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. న‌కాశ్ అజీజ్ పాడిన ఈ పాట‌కి కేదార‌నాథ్ లిరిక్స్ అందించారు. చిత్రానికి త్రివిక్ర‌మ్ క‌థ అందించాడ‌ని తెలుస్తుంది. ఏప్రిల్ 5న మూవీ రిలీజ్‌కి ప్లాన్ చేశారు. న‌ట‌రాజ‌న్ సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా ప‌ని చేస్తున్నారు. అ..ఆ సినిమా త‌ర్వాత నితిన్ చేస్తున్న ఈ మూవీపై అభిమానుల‌లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.


1474
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles