ఉయ్యాల‌వాడ న‌ర‌సింహ‌రెడ్డి ఒరిజిన‌ల్ లుక్ ఇదే

Fri,February 22, 2019 12:03 PM
Uyyalawada Narasimha Reddy original look revealed

భార‌త మాత‌కు బిగుసుకున్న సంకెళ్ళ‌ని తెంచ‌డానికి రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మించిన వ్య‌క్తి ఉయ్యాల వాడ న‌ర‌సింహ‌రెడ్డి. ఆ నాటి రోజుల‌లో బ్రిటీష్ సైనికుల‌తో అర్ధ‌రాత్రి, అప‌రాత్రి అనే తేడా లేకుండా యుద్ధం చేశాడు. ఇప్పుడు ఆయన జీవిత నేప‌థ్యంలో చిరు 151వ చిత్రంగా సురేంద‌ర్ రెడ్డి సైరా అనే మూవీని తెర‌కెక్కిస్తున్నాడు. ఇందులో ఉయ్యాల‌వాడ పాత్రని మెగాస్టార్ చిరంజీవి పోషిస్తుండ‌గా, ఆయ‌న పాత్ర‌కి సంబంధించి ప‌లు లుక్స్ ఇప్ప‌టికే విడుద‌ల‌య్యాయి. ఉయ్యాల‌వాడ పాత్ర‌లో చిరు ఒదిగిపోయాడని ప‌లు ప్ర‌శంస‌లు కూడా ల‌భించాయి. అయితే ఈ రోజు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి వ‌ర్ధంతి కాగా, ఆయ‌నని స్మ‌రించుకున్న సైరా ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి త‌న ట్విట్ట‌ర్‌లో ఉయ్యాల‌వాడ న‌ర‌సింహ‌రెడ్డి ఒరిజిన‌ల్ ఫోటోని షేర్ చేస్తూ నివాళులు అర్పించారు. సైరా చిత్రాన్ని రామ్ చ‌ర‌ణ్ కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బేన‌ర్‌పై నిర్మిస్తున్నారు. ద‌స‌రా కానుక‌గా ఈ చిత్రం విడుద‌ల కానుంది. జ‌గ‌ప‌తి బాబు, విజ‌య్ సేతుప‌తి, అమితాబ్ బ‌చ్చ‌న్, సుదీప్‌, త‌మ‌న్నా, న‌య‌న తార ప‌లువురు ఈ చిత్రంలో ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ర‌త్న‌వేలు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేస్తున్నారు.8182
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles