మహేశ్‌బాబును కలిసిన ఉత్తరాఖండ్ సీఎం..

Mon,June 18, 2018 04:47 PM
Uttarakhand CM rawat Meets Mahesh Babu

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. మహేశ్ 25వ ప్రాజెక్టుగా వస్తున్న ఈ చిత్రం షూటింగ్ డెహ్రాడూన్‌లో ప్రారంభమైంది. ఇక మహేశ్ కొత్త సినిమా ఉత్తరాఖండ్‌లో షూటింగ్ జరుపుకుంటున్న విషయాన్ని తెలుసుకున్న ఆ రాష్ట్ర సీఎం త్రివేంద్ర సింగ్ రావత్.. సెట్స్ వద్దకు వెళ్లారు. సీఎం త్రివేంద్ర సింగ్ మహేశ్‌బాబును సెట్స్‌లో కలిసిన ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ముగ్గురు విద్యార్థులు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసేందుకు ఉత్తర భారతదేశ పర్యటనకు వెళ్లే కథాంశం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.

3216
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles