రోజూ తాగేవాడిని.. అతడే నాకు సాయం చేశాడు!

Sun,June 3, 2018 03:50 PM

బాబీ డియోల్.. సోల్జర్ మూవీతో బాలీవుడ్‌లో తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్న నటుడు. అయితే ఆ తర్వాత తన తండ్రి ధర్మేంద్ర, అన్న సన్నీ డియోల్‌లాగా పెద్దగా సక్సెస్ సాధించలేకపోయాడు. కెరీర్ గాడి తప్పడంతో తాను పూర్తి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని, ఆ సమయంలో సల్మాన్‌ఖాన్, అతని ఫ్యామిలీ తనకు అండగా నిలిచినట్లు బాబీ చెప్పాడు.

నన్ను నేను పట్టించుకోవడం మానేశాను. నటుడిగా నా శరీరాకృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అయితే సడెన్‌గా కెరీర్‌లో అన్నీ కోల్పోవడం మొదలైంది. నన్ను నేను తక్కువ చేసి చూసుకున్నాను. ప్రతి రోజూ తాగేవాడిని అని బాబీ డియోల్ చెప్పాడు. అయితే తన కొడుకులు ఆర్యమాన్, ధరమ్ కోసం తాను కచ్చితంగా మారాలని అనుకున్నట్లు అతను తెలిపాడు. ఈ సమయంలోనే శ్రేయాస్ తల్పడే పోస్టర్ బాయ్స్ మూవీతో వచ్చాడు. ఇది బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ సాధించకపోయినా.. నాకు మంచి పేరు వచ్చింది. ఇది నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది అని అతనన్నాడు.

సల్మాన్ లీడ్ రోల్‌లో నటిస్తున్న రేస్ 3 మూవీలో బాబీ డియోల్ కనిపించనున్నాడు. ఈ మూవీ వచ్చే వారం రిలీజ్ కాబోతున్నది. అసలు తనకు రేస్ 3 మూవీ ఆఫర్ రావడం వెనుక కారణాన్ని కూడా బాబీ ఈ సందర్భంగా వివరించాడు. సల్మాన్‌తో సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో కలిసినపుడు మాట్లాడాను. ఆ తర్వాత అతనితో రెగ్యులర్‌గా కలుస్తూనే ఉన్నా. ఆ సమయంలో అతను ఓ మాట చెప్పాడు. నా కెరీర్ బాగా లేని సమయంలో నేను సంజయ్‌దత్, మీ అన్న సన్నీ డియోల్‌ల భుజాలపైకి ఎక్కాను అని సల్మాన్ అన్నాడు. ఆ సందర్భంలో నేను నీ భుజాలపై ఎక్కుతా అని నేను అన్నాను. దీంతో అతను ఓ రోజు కాల్ చేసి షర్ట్ విప్పుతావా.. రేస్ 3 ఆఫర్ ఇస్తా అన్నాడు. నేను దేనికైనా రెడీ అన్నాను అని బాబీ డియోల్ చెప్పుకొచ్చాడు.

కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులను చూసిన తర్వాత ఇప్పుడు తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని, ఇక ఒక్క రోజు కూడా ఖాళీగా ఇంట్లో కూర్చోనని బాబీ చెప్పాడు. రేస్ 3 తర్వాత బాబీ డియోల్ హౌజ్‌ఫుల్ 4లో కనిపించనున్నాడు. ఆ తర్వాత యమ్‌లా పగ్‌లా దీవానా ఫిర్ సె మూవీలో అన్న సన్నీ డియోల్, తండ్రి ధర్మేంద్రతో కలిసి నటించనున్నాడు.

9525
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles