ఆస‌క్తి రేపుతున్న‌ ‘యురి: ది సర్జికల్‌ స్ట్రయిక్‌‌’ ట్రైల‌ర్‌

Wed,December 5, 2018 12:10 PM
URI trailer released

2016 సెప్టెంబర్‌ 18న జమ్ము కశ్మీర్ యురి సెక్టార్‌ లోని ఆర్మీ స్థావరంపై టెర్ర‌రిస్ట్‌లు ఎటాక్ చేసిన సంఘ‌ట‌న ఎంత పెద్ద సంచ‌ల‌నం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ దాడిని భార‌త్‌తో పాటు ప‌లు దేశాలు ఖండించాయి. యురి దాడికి వ్య‌తిరేఖంగా ఇండియ‌న్ ఆర్మీ స‌ర్జిక‌ల్ స్ట్రైక్( సెప్టెంబర్‌ 29న) చేసింది. ఇప్పుడు స‌ర్జికల్ స్ట్రైక్ నేప‌థ్యంలో బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఆదిత్య దార్ యురి అనే సినిమా చేస్తున్నాడు. రొన్ని స్క్రూవాలా బేన‌ర్‌పై ఆర్ఎస్‌వీపీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విక్కీ కౌశ‌ల్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నాడు. ఆయ‌న స‌ర‌స‌న యామీ గౌత‌మ్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. అయితే చిత్రంలో విక్కీ కౌశ‌ల్‌.. పాకిస్థాన్ టెర్ర‌రిస్ట్‌ల‌పై స‌ర్జిక‌ల్ స్ట్రైక్ చేసే టీం క‌మాండ‌ర్ చీఫ్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు .

తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో స‌న్నివేశాలు స‌ర్జిక‌ల్ స్ట్రైక్‌కి సంబంధించిన సంఘ‌ట‌న‌ల‌ని క‌ళ్ళ‌కు క‌ట్టేటా ఉన్నాయి. ‘నా దేశం కోసం, నా సోదరుల కోసం ఇప్పుడు పోరాడకపోతే..నాకు నేనే ఓ బోగస్(మోసగాడు)లా మిగిలిపోతాను. సర్‌..మీరు నన్ను ఎక్కడికైనా పంపించండి. మన సైనికులను సురక్షితంగా తీసుకొచ్చే బాధ్యత నాది’ అంటూ విక్కీ చెప్పిన డైలాగ్‌తో ట్రైల‌ర్ మొద‌లైంది. ప‌రేష్ అధికారి పాత్ర‌లో కనిపించ‌నుండ‌గా, యామి గౌత‌మ్ ఓ అధికారిణిగా క‌నిపిస్తుంది. ఉరిలో కాల్పులు జరిపిన వారితో సంబంధం ఉన్న పాకిస్థానీ వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని మెడకు తీగ బిగించి విచారణ జరిపించడం ఆకట్టుకుంటోంది. చిత్రంలో క్రితి కుల్హ‌రీ, మోహిత్ రైనా, మ‌నీష్ చౌద‌ర్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. జ‌న‌వ‌రి 11, 2019న ఈ మూవీ విడుద‌ల కానుంది. ఆర్‌ఎస్‌వీపీ మూవీస్‌ బ్యానర్‌పై రోన్నీ స్క్రూవాలా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

1901
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles