అఖిల్‌కి త‌ల్లిగా సీనియ‌ర్ హీరోయిన్..!

Thu,June 13, 2019 10:50 AM
update on Akhils Film With Bommarillu Bhaskar

అక్కినేని అఖిల్ న‌టించిన మూడు చిత్రాలు అఖిల్‌, హ‌లో, మిస్ట‌ర్ మ‌జ్ను చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్ట‌డంతో ఆయ‌న నాలుగో సినిమాకి చాలా గ్యాప్ తీసుకున్నాడు. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న నాలుగో చిత్రాన్ని అఖిల్ చేయ‌నుండ‌గా, ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బేన‌ర్‌పై బ‌న్నీ వాసు నిర్మిస్తున్నాడు. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం ఈ చిత్రం గ్రాండ్‌గా లాంచ్ కాగా, రెగ్యుల‌ర్ షూటింగ్ ఆగ‌స్ట్ నుండి జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో అఖిల్‌కి త‌ల్లిగా సీనియ‌ర్ హీరోయిన్ ఆమ‌ని న‌టిస్తుంద‌ట‌. చిత్రంలో త‌ల్లి పాత్ర కీల‌కం కాగా, ఆ పాత్ర‌కి ఆమ‌ని అయితే బాగుంటుంద‌ని ద‌ర్శ‌కుడు ఆమెని ఎంపిక చేశాడ‌ట‌. ఇక్క‌డ ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే 24 ఏళ్ళ క్రితం సిసింద్రీ చిత్రంలో అఖిల్‌కి త‌ల్లిగా ఆమ‌ని న‌టించారు. ఇప్పుడు మ‌రోసారి ఆయ‌న‌కి త‌ల్లిగా ఆమ‌ని న‌టించ‌నుండ‌డం విశేషం. అఖిల్‌కి త‌ల్లిగా ఆమని న‌టించిన సిసింద్రీ చిత్రం మంచి హిట్ కావ‌డంతో ఇప్పుడు అఖిల్ నాలుగో చిత్రం కూడా స‌క్సెస్ సాధిస్తుంద‌ని అభిమానులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. గోపి సుంద‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు

2455
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles