ఇండియా- పాక్ మ్యాచ్‌లో సంద‌డి చేసిన ఉపాస‌న‌, ర‌కుల్‌

Tue,June 18, 2019 08:37 AM
upasana watched india pak match

వ‌ర‌ల్డ్‌క‌ప్ 2019 మ్యాచ్‌లో భాగంగా దాయాది దేశం పాకిస్థాన్‌పై భార‌త్ సునాయాస విజ‌యం న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ధ‌తి ప్ర‌కారం కోహ్లీ సేన 89 ర‌న్స్ తేడాతో పాక్‌పై నెగ్గింది. ఈ విక్ట‌రీపై టీమిండియాకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే మొద‌టి నుండి ఈ మ్యాచ్‌పై ఫుల్ క్రేజ్ నెల‌కొండ‌డంతో ప‌లువురు సెల‌బ్రిటీలు ఈ మ్యాచ్‌ని డైరెక్ట్‌గా వీక్షించేందుకు ఇంగ్లండ్ వెళ్లారు. ర‌ణ్‌వీర్ సింగ్‌ .. మ‌హ్మ‌ద్ ష‌మీతో క‌లిసి కాసేపు ముచ్చ‌టించ‌డాన్ని టీవీ స్క్రీన్స్‌లో చూశాం. ఆ త‌ర్వాత ర‌ణ్‌వీర్ గ్రౌండ్‌లో కూడా కాసేపు సంద‌డి చేశారు. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూడా ఈ మ్యాచ్‌ని వీక్షించారు. ఇక రామ్ చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న కూడా త‌న ఫ్రెండ్స్ ర‌కుల్ ప్రీత్ సింగ్‌, మంచు ల‌క్ష్మీ, క‌నికా క‌పూర్‌ల‌తో క‌లిసి మాంచెస్ట‌ర్ గ్రౌండ్‌లో మ్యాచ్‌ని వీక్షించింది. స్టేడియంలో తొలిసారి మ్యాచ్ చూసాను అని గ్రౌండ్‌లో దిగిన ఫోటోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. సూప‌ర్ స్టార్ మ‌హేష్ కూడా రీసెంట్‌గా ఆస్ట్రేలియాతో భార‌త్ ఆడిన మ్యాచ్‌ని గ్రౌండ్‌కి వెళ్ళి వీక్షించిన విష‌యం తెలిసిందే.
2029
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles