నెటిజ‌న్స్ స‌ల‌హా కోరిన ఉపాస‌న‌.. ఏ విష‌యంలోనో తెలుసా ?

Sun,July 28, 2019 08:23 AM
Upasana suggest the name of horse

రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ అనే విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌తో పాటు వ‌ర్క్ విష‌యాల‌ని ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా త‌న ట్విట్ట‌ర్‌లో త‌మ పెంపుడు గుర్రం ఫిల్లీకి ఆడ పిల్ల పుట్టింద‌ని, అది ఎంతో అందంగా ఉంద‌ని పేర్కొంది. తల్లి గుర్రంతో పాటు పిల్ల గుర్రం ఫోటోని పోస్ట్ చేసిన ఉపాస‌న పుట్టిన గుర్రానికి ఓ పేరు సూచించండ‌ని కోరింది. దీంతో నెటిజ‌న్స్ అనేక ర‌కాల పేర్లు స‌జెస్ట్ చేస్తున్నారు. కరుణ్, రామ్, మస్తంగ్, బాద్షా, ద్రోణ, ధ్రువ, చిట్టి, ఉడాన్, చెర్రీ, రీనా, గ్రేసీ, హార్వీ, బంగారం, సనా, మిస్సీ ఇలా వందల కొద్దీ పేర్లు సూచిస్తున్నారు ఫ్యాన్స్. రామ్ చ‌ర‌ణ్‌, చెర్రీకి జంతువులంటే చాలా ఇష్టం. గ‌తంలో రాజ‌స్థాన్‌లో 'సేవ్ ఇండియా బిగ్ క్యాట్స్' పేరుతో పెంపుడు జంతువుల సంరక్షణ శిబిరం ప్రారంభించింది ఉపాస‌న‌. ఇటీవ‌ల ద‌క్షిణ‌ ఆఫ్రికాలో వైల్డ్ లైఫ్ సఫారీ చేసిన రామ్ చ‌ర‌ణ్ జంట అక్క‌డ జంతువుల‌ని మ‌చ్చిక చేసుకొని స‌ర‌దాగా గ‌డిపారు. రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.



1276
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles