మామ డ్యూటీ చేస్తున్నాడన్న ఉపాస‌న

Fri,October 12, 2018 12:17 PM
upasana shares interesting post on ram charan

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ అనే సంగ‌తి తెలిసిందే. త‌న భ‌ర్త‌కి సంబంధించిన సినిమాలు లేదా ప్రైవేట్ పార్టీస్ వంటి అంశాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ ఇస్తుండే ఉపాస‌న తాజాగా త‌న ట్విట్ట‌ర్‌లో మా ఆయ‌న మామ డ్యూటీ చేస్తున్నాడు అంటూ ఓ ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో చెర్రీ త‌న మేన‌కోడ‌లితో కేక్ క‌ట్ చేయిస్తుండ‌గా చుట్టు ప‌క్క‌ల అల్లు అర్జున్ కుమారుడు అయాన్, శ్రీజ కూతురితో పాటు మ‌రి కొంద‌రు చిన్నారులు ఉన్నారు. చెర్రీ త‌న మేన‌కోడ‌లి బ‌ర్త్‌డేని ద‌గ్గ‌రుండి చేయించ‌డంతో ఆమె చాలా హ్యాపీగా ఫీలైంద‌ట‌. బోయ‌పాటి శీను ద‌ర్శ‌క‌త్వంలో యాక్ష‌న్ మూవీ చేస్తున్న చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ఖాళీగా ఉండ‌డంతో ఫ్యామిలీ స‌భ్యుల‌తో క‌లిసి స‌ర‌దాటైం గ‌డుపుతున్నాడు. ఉపాస‌న రీసెంట్‌గా త‌న ట్విట్ట‌ర్‌లో చెర్రీతో క‌లిసి లాంగ్ డ్రైవ్‌కి వెళుతున్న వీడియోని పోస్ట్ చేయ‌గా, ఇది చూసిన నెటిజ‌న్స్ స‌ర‌దాగా స్పందించారు.


4499
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles