‘సాండ్‌ కీ ఆంఖ్‌’ సినిమాకు జీఎస్టీ మినహాయింపు

Tue,October 22, 2019 04:10 PM


లక్నో: షార్ప్ షూటర్లు చంద్రో తోమర్, ప్రకాశి తోమర్ జీవిత నేపథ్యంలో వస్తోన్న చిత్రం సాండ్ కీ ఆంఖ్. ఈ చిత్రానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పన్ను నుంచి మినహాయింపునిచ్చింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం బాలీవుడ్ మూవీ సాండ్ కీ ఆంఖ్‌కు జీఎస్టీని తొలగించినట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి శ్రీకాంత్ శర్మ తెలిపారు. దీపోత్సవ్ మేళాను రాష్ట్రస్థాయి కార్యక్రమంగా పరిగణిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.


‘సాండ్‌ కీ ఆంఖ్‌’ చిత్రం ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు షార్ప్‌ మహిళా షూటర్లు చంద్రో, ప్రకాశీ తోమర్‌ల జీవితాధారంగా తుషార్‌ హీరానందని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతుంది. జాతీయ స్థాయిలో రైఫిల్స్ షూటింగ్ ఎన్నో పతకాలు సాధించి..ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలిచారు చంద్రో తోమర్, ప్రకాశి తోమర్. ఈ చిత్రంలో 87 ఏళ్ళ చంద్రో తోమ‌ర్ పాత్ర‌లో తాప్సీ పన్ను న‌టిస్తుండ‌గా,82 ఏళ్ళ‌ ప్రకాశీ తోమర్ పాత్ర‌లో భూమి పడ్నేక‌ర్ న‌టిస్తున్నారు. దీపావ‌ళి కానుక‌గా చిత్రం విడుద‌ల కానుంది.

669
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles