మోదీ బ‌యోపిక్.. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసిన ప్ర‌భాస్

Tue,September 17, 2019 12:48 PM

ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో బ‌యోపిక్‌లో ట్రెండ్ న‌డుస్తుంది. ఆ మ‌ధ్య ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ జీవిత నేప‌థ్యంలో బ‌యోపిక్ రూపొందించారు. నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ ఒమంగ్ కుమార్ తెర‌కెక్కించిన చిత్రం పీఎం నరేంద్రమోదీ పేరుతో విడుద‌లై డివైడ్ టాక్ తెచ్చుకుంది. మోదీ పాత్ర‌లో వివేక్ ఒబేరాయ్ క‌నిపించారు. ఇక ఇప్పుడు మోదీ చరిత్రను ప్రతీ ఒక్కరికీ తెలిసే విధంగా సంజ‌య్ లీలా భ‌న్సాలీ స‌న్నాహాలు చేస్తున్నాడు. ‘మన్‌ బైరాగీ’ అనే టైటిల్‌తో ఈ సినిమాని విడుద‌ల చేయ‌నున్నాడు. తెలుగులో ఈ చిత్రం మ‌నో విరాగి పేరుతో రిలీజ్ కానుంది.


ప్రధాని మోదీ జీవితానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎవరికీ తెలియని విషయాలను‘మన్‌ బైరాగీ’ సినిమాలో చూపించనుండ‌గా, తాజాగా చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ప్ర‌భాస్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫ‌స్ట్ లుక్ రివీల్ చేశాడు. అక్ష‌య్ కుమార్ త‌న ట్విట్ట‌ర్ లో పోస్ట‌ర్ షేర్ చేశాడు. పోస్ట‌ర్ అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. సంజ‌య్ లీలా భ‌న్సాలీ మ‌రియు మ‌హావీర్ జైన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంజయ్ త్రిపాఠి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రధాని యువకుడిగా ఉన్న సమయంలో ఆయన జీవితంలో జరిగిన ముఖ్య మలుపు ఏంట‌నేది ఈ చిత్రంలో చూపించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.



2108
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles