‘కేదార్‌నాథ్’ కోసం ముంబైలో స్పెషల్ సెట్

Mon,April 23, 2018 05:54 PM
Underwater Sequences to shoot for kedarnath movie


ముంబై : సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్, సారా అలీఖాన్ కాంబినేషన్‌లో కేదార్‌నాథ్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కేదార్‌నాథ్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే లవ్‌స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా వస్తుంది. డైరెక్టర్ అభిషేక్ అండ్ టీం ఈ మూవీకి సంబంధించి నీటిలో జరిగే సన్నివేశాలను చిత్రీకరించేందుకు (అండర్‌వాటర్ షూట్) ప్లాన్ చేస్తోంది. దీనికోసం ముంబై సరిహద్దు ప్రాంతంలో ప్రత్యేకంగా ఓ సెట్‌ను కూడా వేశారట. కేదార్‌నాథ్ సినిమాతో సారా అలీఖాన్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తోంది. రొన్నీ స్క్రీవ్‌వాలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ ఏడాది డిసెంబర్ లో కేదార్ నాథ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

1472
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles