మహేశ్ బాబు ఉగాది కానుక: పంచెకట్టులో సీఎం భరత్

Sun,March 18, 2018 03:33 PM
 Ugadi Treat For Superstar maheshbabu Fansహైదరాబాద్: సూపర్‌స్టార్ మహేశ్‌ బాబు హీరోగా నటిస్తున్న భ‌ర‌త్ అనే నేను చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కైరా అడ్వాణీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా అభిమానుల కోసం చిత్రయూనిట్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక హోదాలో సంప్రదాయ పద్ధతిలో పండుగను ఎలా జరుపుకుంటారో ఈ పోస్టర్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్న మహేశ్ బాబు పంచెకట్టుతో అదరగొట్టారు. రాజకీయ నేపథ్యంలో మహేశ్‌బాబు, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం ఇది. వీరిద్దరి కాంబినేషనలో గతంలో వచ్చిన శ్రీమంతుడు భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. భ‌ర‌త్ అనే నేను చిత్రాన్ని ఏప్రిల్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు.

3795
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS