చావుకి ద‌గ్గ‌ర‌గా ఉన్న‌ట్టు అనిపిస్తోంది..

Sun,March 24, 2019 11:44 AM

య‌శ్‌రాజ్ ఫిలింస్ అధినేత య‌శ్ చోప్రా కుమారుడు ఉద‌య్ చోప్రా కొద్దిసేప‌టి క్రితం ట్విట్ట‌ర్‌లో చేసిన పోస్ట్‌లు నెటిజ‌న్స్‌ని షాక్‌కి గుర‌య్యేలా చేశాయి. ‘ధూమ్‌’, ‘ధూమ్‌ 2’, ‘ప్యార్‌ ఇంపాజిబుల్‌’ వంటి చిత్రాల్లో న‌టించిన ఉద‌య్ ఎంతో ధైర్యంగా ఉంటారు. గ‌తంలో ఒత్తిడి, ఒంట‌రిత‌నంతో బాధ‌ప‌డుతున్న వారిని ద‌గ్గ‌ర‌కు తీసుకొని ధైర్యం అందించాల‌ని చెప్పిన ఆయ‌న తాజాగా చేసిన‌ ట్వీట్‌లో చావుకి ద‌గ్గ‌ర‌గా ఉన్న‌ట్టు అనిపిస్తోంది. ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి ఇదే స‌రైన స‌మ‌యం అని రాయ‌డంతో ప్ర‌తి ఒక్క‌రు ఖంగు తిన్నారు.


ఉద‌య్ చోప్రా త‌న ట్విట్ట‌ర్‌లో మీ అంద‌రికి ఓ విష‌యం గురించి చెప్పాల‌నుకుంటున్నాను. ప్ర‌స్తుతం నా ప‌రిస్థితి బాగోలేదు. ఎంత‌గానో ప్ర‌య‌త్నిస్తున్న‌ప్ప‌టికి ఓడిపోతూ వ‌స్తున్నాను. కొన్ని గంట‌ల పాటు నా ట్విట్ట‌ర్ ఎకౌంట్‌ని డీ యాక్టివేట్ చేశాను. చావుకి ద‌గ్గ‌ర‌గా ఉన్న‌ట్టు అనిపించింది. ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి ఇదే స‌రైన స‌మ‌య‌మా అని అనిపిస్తోంది. నేను త్వ‌ర‌లోనే ఈ లోకాన్ని వీడి శాశ్వ‌తంగా వెళ్లిపోతాన‌నిపిస్తుందంటూ సంచ‌ల‌న ట్వీట్స్ చేశారు. ఈ ట్వీట్స్ చూసిన కొంద‌రు నెటిజ‌న్స్ ఆయ‌న ఆలోచ‌న‌ల‌ని మార్చే ప్ర‌య‌త్నం చేసే దిశ‌గా ట్వీట్ చేస్తూ ధైర్యాన్ని అందిస్తున్నారు. అయితే ఉద‌య్ ఈ ట్వీట్స్‌ పెట్టిన కొద్ది నిమిషాల తర్వాతే డిలీట్‌ చేశారు. కాని కొంద‌రు స్క్రీన్ షాట్స్ తీయ‌డంతో అవి సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. కొద్ది రోజులు అమెరికాలో ఉన్న ఉద‌య్ ఇటీవ‌ల ముంబై వ‌చ్చారు.


5721
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles