స‌మంత 'యూట‌ర్న్' ట్రైల‌ర్‌కి టైం ఫిక్స్ చేసింది

Sun,August 12, 2018 07:44 AM
u turn trailer release date fixed

ఈ ఏడాది ప్ర‌థ‌మార్ధంలో వ‌రుస విజ‌యాలు సాధించిన స‌మంత ద్వితీయార్దంలోను ఆ హ‌వా కొన‌సాగించాల‌ని అనుకుంటుంది. స‌మంత న‌టించిన త‌మిళ సినిమాలు విడుద‌ల‌కి రెడీ అవుతుండ‌గా, తెలుగులో న‌టిస్తున్న యూట‌ర్న్ చిత్రం సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల కాబోతుంది. క‌న్న‌డ చిత్రానికి రీమేక్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ప‌వ‌న్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుంది. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ తుది ద‌శ‌కి చేరుకుంది. చిత్ర ట్రైల‌ర్‌ని ఈ నెల 17న విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో భూమిక , అది పినిశెట్టి , రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం ఫై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈచిత్రానికి పూర్ణ చంద్ర తేజస్వి సంగీతం అందిస్తున్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల‌లో విడుద‌ల కానున్న యూట‌ర్న్ చిత్రం ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క మెప్పిస్తుంద‌ని చెబుతున్నారు.

1306
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS