స‌మంత స్పెష‌ల్ సాంగ్‌కి హ్యూజ్ రెస్పాన్స్

Tue,September 4, 2018 09:51 AM
U Turn The Karma Theme song released

అక్కినేని వారి కోడ‌లు స‌మంత న‌టించిన తాజా చిత్రం యూట‌ర్న్‌. క‌న్న‌డ రీమేక్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం పవన్ కుమార్ దర్శకత్వంలో రూపొందింది. సెప్టెంబ‌ర్ 13న ఈ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో స‌మంత‌తో పాటు భూమిక , అది పినిశెట్టి , రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రల్లో నటించారు. సమంత తన పాత్రకి ఓన్ డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం ఫై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈచిత్రానికి పూర్ణ చంద్ర తేజస్వి సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ భాషలలో విడుదల కానున్న యూటర్న్ చిత్రం రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో మేక‌ర్స్ వినూత్న ప్ర‌చారాలు చేస్తున్నారు. రీసెంట్‌గా అనిరుధ్ స్వ‌ర‌ప‌రచిన క‌ర్మ థీమ్ అనే స్పెష‌ల్ సాంగ్ విడుద‌ల చేశారు. ఈ సాంగ్‌కి హ్యూజ్ రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై అంచ‌నాలు పెంచింది. ఇప్పటికే ఈసినిమా విడుదల హక్కులను మంచి రేట్లకు అమ్ముడయ్యాయి. వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళుతున్న స‌మంత ఈ మూవీతో మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంటుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో చైతూ స‌ర‌స‌న క‌థానాయిక‌గా ఓ చిత్రం చేస్తుంది సామ్.

2129
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles