సమంత 'యూ టర్న్' ట్రైలర్ విడుదల

Fri,August 17, 2018 03:10 PM
U Turn  Telugu  Official Trailer

ఈ ఏడాది ప్రథమార్ధంలో వరుస విజయాలు సాధించిన సమంత ద్వితీయార్దంలోను ఆ హవా కొనసాగించాలని అనుకుంటుంది. సమంత నటించిన తమిళ సినిమాలు విడుదలకి రెడీ అవుతుండగా, తెలుగులో నటిస్తున్న యూటర్న్ చిత్రం సెప్టెంబర్ 13న విడుదల కాబోతుంది. కన్నడ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పవన్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ తుది దశకి చేరుకుంది. చిత్ర ట్రైలర్ ని కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. ఇందులో సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భూమిక , అది పినిశెట్టి , రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సమంత తన పాత్రకి ఓన్ డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం ఫై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈచిత్రానికి పూర్ణ చంద్ర తేజస్వి సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ భాషలలో విడుదల కానున్న యూటర్న్ చిత్రం ప్రేక్షకులని తప్పక మెప్పిస్తుందని చెబుతున్నారు.

1966
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS