తారలను, విటులను విచారించే అవకాశం

Tue,June 19, 2018 06:43 AM
Two Top Tollywood Actors Among Victims in US Sex Racket

హైదరాబాద్ : అమెరికాలో బయటపడిన తెలుగు సినీతారల సెక్స్ రాకెట్‌కు సంబంధించి కీలక డైరీలు షికాగో పోలీసులకు లభించాయి. అమెరికాలో రహస్యంగా సెక్స్ రాకెట్‌ను నడిపిస్తున్న తెలుగు సినీ నిర్మాత మోదుగుమూడి కిషన్, అతడి భార్య చంద్రకళను ఫెడరల్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దర్యాప్తులో భాగంగా పలు చోట్ల గాలింపు చేపట్టగా, షికాగో వెస్ట్‌వెల్డస్ అమెన్యూలోని నిందితుల ఇంటిలో డైరీలు దొరికాయి. డైరీలో లభించిన ఆధారాలు, సాక్షులు ఇచ్చిన వాంగ్మూలంతో పోలీసులు 42 పేజీల చార్జిషీట్‌ను షికాగో కోర్టులో సమర్పించారు. వీటిని న్యాయస్థానం పరిశీలిస్తున్నది. నిందితులు బెయిల్ కోసం ప్రయత్నించగా, కస్టడీలోనే ఉండాలంటూ జడ్జి మారియా వాల్డేజ్ ఆదేశించారు.

నిందితుల పిల్లలను వర్జీనియాలోని సంరక్షణ గృహంలో ఉంచారు. డైరీల్లో లభించిన సమాచారంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. భారత్ నుంచి వచ్చిన తారలు, వారు బసచేసే హోటళ్ల వివరాలు, వ్యభిచారానికి సంబంధించిన ఒప్పంద సమాచారం, వారికి డబ్బులిచ్చిన వివరాలు డైరీల్లో రాసి ఉన్నట్టు తెలిసింది. షికాగో, డల్లాస్, న్యూజెర్సీ, వాషింగ్టన్ తదితర నగరాల్లోని హోటళ్లలో క్లయింట్ల దగ్గరికి పంపేవారని తేలింది. విషయం ఎక్కడైనా చెప్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తారలను హెచ్చరించినట్టు దర్యాప్తులో వెల్లడైంది. దర్యాప్తులో భాగంగా వ్యభిచారం చేసిన తారలు, విటులను ఫెడరల్ పోలీసులు విచారించే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది.

3669
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles