చైతూ-సమంత వివాహ వేడుకకి హాజరయ్యే సెలబ్రిటీలు వీరే..!

Thu,September 14, 2017 04:13 PM
Two Top Stars attend to Naga Chaitanya and Samantha wedding invitation

కొద్ది కాలంగా ప్రేమలో ఉన్న నాగ చైతన్య – సమంత జంట అక్టోబర్ 6న వివాహ బంధంతో ఒక్కటి కానున్న సంగతి తెలిసిందే. గోవాలో జరగనున్న పెళ్ళికి సంబంధించిన పనులు స్పీడ్ అందుకున్నాయి. గడువు దగ్గర పడుతుండడంతో అతిధుల లిస్ట్ ని కూడా రెడీ చేస్తున్నారట. అయితే ఈ లవబర్డ్స్ పెళ్ళి వేడుక ఓ ప్రైవేట్ ఫంక్షన్ గా జరగనుందని ఇటీవల వార్తలు రాగా, కేవలం సన్నిహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు మాత్రమే పెళ్లి కి హాజరు కానున్నారని సమాచారం. సెలబ్రిటీల కోసం అక్టోబర్ 13న హైదరాబాద్‌ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారని టాక్.

టాలీవుడ్ ప్రేమపక్షులు సమంత- చైతూ పెళ్ళికి కొందరు సెలబ్రిటీలు మాత్రమే హాజరు కానున్నారని సమాచారం. అందరి కన్నా ముందు చైతూ బ్ల‌డ్ రిలేష‌న్ రానా ఈ పెళ్ళిలో సందడి చేయనుండగా, ఈయనతో పాటు చైతూకి క్లోజ్ ఫ్రెండ్స్ అయిన నితిన్, అల్లు శిరీష్‌, ఎన్టీఆర్, రామ్ చరణ్‌ లు ప్రత్యేక ఆహ్వనితులుగా హాజరు కానున్నారట. ఇక సమంత వైపు నుండి స్టైలిష్‌ డిజైనర్ నీరజ కోన మాత్రమే హాజరు కానుందని టాక్. ఇక రిసెప్ష‌న్‌కి నాగ చైతన్య, సమంత, నాగార్జున ఎవరికి వారు తమకి సంబంధించిన వారిని వ్యక్తిగతంగా ఆహ్వనించనున్నారని టాక్.

4970
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS