మ‌రో రెండు పోస్ట‌ర్స్‌తో అంచ‌నాలు పెంచిన ఆర్జీవి

Tue,January 22, 2019 09:36 AM
two pics comes from lakshmis ntr

రామ్ గోపాల్ వ‌ర్మ సినిమాలు ఎలా ఉన్నా, ఆ సినిమాలోని పాత్ర‌లు మాత్రం ఒరిజిన‌ల్‌కి జీరాక్స్‌లా ఉంటాయ‌నేది అందరు ఒప్పుకోవ‌ల‌సిన అంశం. ప్ర‌తి పాత్ర‌పై ఎంతో శ్ర‌ద్ధ పెట్టి ఆర్టిస్టుల‌ని సెల‌క్ట్ చేస్తున్న వ‌ర్మ తాజాగా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా కోసం కీల‌క పాత్ర‌ల‌లో ప‌లువురి న‌టుల‌ని ఎంపిక చేసి ఔరా అనిపించాడు. ప‌లు సినిమాల్లో నటించి మెప్పించిన యజ్ఞాశెట్టి ‘లక్ష్మీపార్వతి’ పాత్రలో నటిస్తోండ‌గా, ఎన్టీఆర్ పాత్రలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రంగస్థల కళాకారుడు న‌టిస్తున్నాడు . ఇక చంద్రబాబు పాత్రలో వంగవీటి సినిమాలో దేవినేని నెహ్రూగా నటించిన శ్రీతేజ్ నటిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రిలో ఈ సినిమా రిలీజ్‌కి ప్లాన్ చేసిన వ‌ర్మ ఒకవైపు శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుతూనే మ‌రోవైపు చిత్రానికి కావ‌ల‌సినంత హైప్ తెస్తున్నాడు.

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంకు సంబంధించి ఫస్ట్‌‌లుక్, రెండు పాటలతో పాటు చంద్రబాబు, లక్ష్మీపార్వతి పాత్రల్లో ఎవరు నటిస్తున్నారనే విషయాలను ఇప్పటికే తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు వ‌ర్మ‌. ఇక రీసెంట్‌గా బాహుబ‌లి చిత్రంలో బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప వెన్నుపోటు పొడిచిన పోస్ట‌ర్‌ని కాస్త మార్ఫింగ్ చేసి ట్విట్ట‌ర్‌లో షేర్ చేశాడు. ఈ ఫోటోలోని వ్య‌క్తులు నాకు స‌రిగా గుర్తు రావ‌డం లేదు.వారెవ‌రో గుర్తించ‌డంలో కాస్త సాయం చేయండి అంటూ కామెంట్ పెట్టాడు. ఇక ఇప్పుడు చిత్రానికి సంబంధించి రెండు ఫోటోలు షేర్ చేశాడు. ఇందులో ఓ ఫోటోలో అన్న‌గారు సుధీర్ఘంగా ఆలోచిస్తున్న స‌మ‌యంలో ల‌క్ష్మీ పార్వతి న‌డిచొస్తున్న‌ట్టుగా ఉంది. రెండో ఫోటోలో ఎన్టీఆర్ పాత్రదారి, మిగిలిన పాత్రదారులతో కలిసి భోజనం చేస్తుండ‌గా, ల‌క్ష్మీ పార్వ‌తి పాత్ర‌ధారి భోజనం వ‌డ్డిస్తున్న‌ట్టుగా ఉంది. ఈ పోస్ట‌ర్స్ అచ్చం రియాలిటీని గుర్తు చేస్తుండ‌డంతో మూవీపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ పెరుగుతున్నాయి. కళ్యాణ్ మాలిక్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

2797
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles