ఒకే రోజు రెండు మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాలు విడుద‌ల‌

Tue,September 18, 2018 10:43 AM
two movies release on same day

మేలిమి ముత్యాల్లాంటి సినిమాల‌ని తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం. ఆయన సినిమాలు ప్రేక్ష‌కుల‌కి ఎంతో ఆహ్ల‌దాన్ని ఇస్తాయి. ఇక కామెడీతో పాటు ఎమోష‌న్ పండించే న‌టులు నాగ్‌, నాని. వీరిద్ద‌రు క‌లిసి తొలిసారి ఓ మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం చేస్తున్నారు. మ‌రి ఈ రెండు చిత్రాలపై ప్రేక్ష‌కుల‌లో భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన‌గా, రెండు ఒకే రోజు పోటీకి దిగ‌డంపై ప్ర‌స్తుతం హాట్ హాట్‌గా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో పారిశ్రామిక విప్లవం నేపథ్యంతో తెర‌కెక్కిన చిత్రం న‌వాబ్ .త‌మిళంలో ఈ చిత్రం చెక్క చివంత వానం (ఎర్రని ఆకాశం తెలుగులో)అనే టైటిల్‌తో విడుద‌ల కానుంది. అర‌వింద్ స్వామి, విజ‌య్ సేతుప‌తి, శింబు, అరుణ్ విజ‌య్‌, జ్యోతిక‌, ఐశ్వ‌ర్య రాజేష్‌, అదితి రావు హైద‌రి, డ‌యానా ఎర‌ప్పా, ప్ర‌కాశ్ రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఈ చిత్రం భారీ మ‌ల్టీ స్టార‌ర్ గా రూపొందుతుంది. మణి సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకిస్‌, లైకా ప్రొడక్షన్స్‌ తో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి యూఏ స‌ర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ బోర్డ్ స‌భ్యులు.

నాగ్‌-నాని ప్ర‌ధాన పాత్ర‌ల‌లో శ్రీరామ్ ఆదిత్య తెర‌కెక్కించిన చిత్రం దేవ‌దాస్‌. ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల చేయ‌నుండ‌గా, ఈ నెల 20న చిత్రానికి సంబంధించిన పాట‌ల‌ని విడుద‌ల చేయ‌నున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో నాని సరసన ఛలో ఫేం రష్మిక మందాన, నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్ కథానాయికలుగా నటించారు . కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో దేవ్ అనే పాత్రలో డాన్ గా నాగ్, దాస్ అనే పాత్రలో డాక్టర్ గా నాని కనిపించనున్నారు. సీనియర్ నరేష్, రావ్ రమేష్, అవసరాల శ్రీనివాస్, బాహుబలి ప్రభాకర్, వెన్నెల కిషోర్, సత్య మొదలగువారు ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రంపై కూడా భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి. మ‌రి రెండు మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాలు ఒకే రోజు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోటీ ప‌డితే ప‌రిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవ‌చ్చు.

2914
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles